ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆగస్టు 21 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన (Nominations Scrutiny) ఉంటుంది.

ఆగస్టు 25 నామినేషన్ల ఉపసంహరణ (Nomination Withdrawal), సెప్టెంబర్ 9పోలింగ్ నిర్వహించి అదే రోజున ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఇక ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభకు చెందిన సభ్యులు ఓటర్లుగా ఉంటారని పేర్కొంది. రాజ్యసభకు నామినేట్‌ అయినవారు కూడా ఓటు వేయవచ్చని తెలిపింది. రాజ్యసభ (Rajya Sabha) లో 233 మంది ఎన్నికైన సభ్యులు 12 మంది నామినేటెడ్‌ సభ్యులుండగా, లోక్‌సభ (Lok Sabha) లో 543 మంది, మొత్తం 788 మంది ఓటర్లు. ప్రస్తుతం రాజ్యసభలో ఐదు, లోక్‌సభలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో 782 మంది ఓటు వేయనున్నారు. అందరూ ఓటు వేస్తే గెలిచే అభ్యర్థికి 391 ఓట్లు అవసరమవుతాయి.

Leave a Reply