Nominations | ఓట్లేసేందుకు కాదు…

Nominations | ఓట్లేసేందుకు కాదు…
Nominations | నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఫోటోలో వరుసలో నిలుచున్న వారంతా.. ఓట్లు వేసేందుకు కాదు… ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు వేసేందుకు వేచి చూస్తున్నారు. పంచాయతీల రెండవ విడత ఎన్నికల నామినేషన్లు(Nominations) చివరి రోజు కావడంతో ఈ రోజు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో రాత్రి వరకు బారులు తీరారు.
నామినేషన్లు వేసేందుకు ఆశావాహులు పంచాయతీ కార్యాలయం వద్దకు భారీగా తరలి రావడంతో అధికారులు ప్రత్యేక స్లిప్పులు(Special slips) ఇచ్చారు. దీంతో నిర్ణీత సమయం ముగిసినా స్లిప్లున్న వారి నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారు. స్థానిక ఎస్ఐ మాలోత్ సురేష్(SI Maloth Suresh) ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
