Mumbai | కూలిన విమానం దర్యాప్తులో తేలాల్సింది ఏంటంటే.. : ఎయిర్ ఇండియా సీఈఓ

  • ఇంజ‌న్ లో గాని, స్విచ్ ల్లో లోపాలు క‌నిపించ‌లేదు
  • బోయింగ్ విమానం పూర్తిగా సుర‌క్షితం
  • అయిల్ ఆఫ్ ఘ‌ట‌న‌పై కొన‌సాగుతున్న ద‌ర్యాప్తు
  • వివ‌రాలు వెల్ల‌డించిన ఎయిర్ ఇండియా సిఈవో కాంప్ బెల్ విల్స‌న్
  • ముంబ‌యి : ప్రమాదానికి గురైన విమానంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య లేవ‌ని ఎయిరిండియా సీఈవో (Air India CEO) కాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఇంజిన్‌లో గానీ.. స్విచ్‌ల్లో గానీ ఎలాంటి నిర్వహణ సమస్యలు లేవని తేల్చి చెప్పారు. బోయింగ్ విమానం పూర్తిగా సేఫ్‌గా ఉందని తెలిపారు. అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదికపై ఆయ‌న స్పందిస్తూ ఒక ప్ర‌క‌ట‌న‌ను నేడు విడుద‌ల చేశారు. ఇంధన స్విచ్‌లపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమ‌ని తేల్చారు.

ఆ స్విచ్‌లను ఎయిరిండియా రెండుసార్లు మార్చినట్లుగా పేర్కొన్నారు. ఇక ఇంధన స్విచ్‌లు పూర్తిగా సురక్షితమని అమెరికా (America) కు చెందిన సంస్థ కూడా తేల్చింద‌ని గుర్తు చేశారు. అయితే విమానం టేకాప్ అయిన తర్వాత రెండు స్విచ్‌లు ఎందుకు ఆపి ఉన్నాయన్న దానిపై దర్యాప్తు జరుగుతోంద‌న్నారు.

ఇక విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ముందు ఇద్దరు పైలట్లకు శ్వాస పరీక్షలు నిర్వహించామ‌ని చెప్పారు. ఆ పరీక్షలో వారిద్దరూ బాగానే ఉన్నార‌ని . ఇక వేరే వైద్య పరీక్షలు మాత్రం జరగలేద‌ని సిఈవో చెప్పారు. ఇంకా పూర్తిగా దర్యాప్తు ముగియలేదని . ముందుగానే లేనిపోని కథనాలు సృష్టించొద్దని విల్సన్ కోరారు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందే విమానాన్ని తనిఖీలు చేశామని.. సేవలకు అనుకూలంగా ఉన్నాదని నిర్ధారించుకున్నాకే ఉపయోగించినట్లు చెప్పారు. ప్రతి విమానాన్ని తనిఖీలు చేస్తామని.. అంతేకాకుండా ఏవైనా కొత్త సూచనలు వస్తే వాటిని కూడా పాటిస్తూ ఉంటామని చెప్పారు. కాగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న బృందంలో విల్సన్ కూడా ఉన్నారు.

Leave a Reply