Nizamabad | అనువైన స్థ‌లం ఎంపిక‌…

Nizamabad | అనువైన స్థ‌లం ఎంపిక‌…

Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ : షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని ఈ రోజు కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ పరిశీలించారు. మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలంలో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్(Shopping complex) నిర్మాణం చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా నిర్మాణ స్థలాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. వ్యాపారాలకు అనుకూలంగా ఉండే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. మార్కెట్ యార్డ్(market yard) పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాలను ఆయన పరిశీలించారు.

అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట కామారెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, సొసైటీ అధ్యక్షులు భూమయ్య, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, సొసైటీ కార్యనిర్వాణా అధికారి రాజు తదితరులు ఉన్నారు.

Leave a Reply