Nizamabad | ఏటీఎంలో దొంగలు పడ్డారు..

Nizamabad | ఏటీఎంలో దొంగలు పడ్డారు..

  • రూ.39లక్షలు దోచుకెళ్లారు..

Nizamabad | నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లాలో దొంగలు ఒక్కసారిగా రెండు ఏటీఎంలను టార్గెట్ చేసి సంచలనం సృష్టించారు. ముసుగులు ధరించి చొరబడిన దుండగులు గ్యాస్ కట్టర్లతో మెషిన్లు తెరిచి నగదు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో కొంత నగదు కాలిపోయి, ఏటీఎంలు పూర్తిగా దగ్ధమవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు దుండగులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు.

సాయినగర్‌ లోని ఎస్‌బీఐ ఏటీఎంలో సుమారు రూ.9 లక్షలు, ఆర్యనగర్‌ లోని డీసీబీ ఏటీఎంలో సుమారు రూ.30 లక్షలు చోరీ అయ్యాయని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఏటీఎంలను తెరవడానికి దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో కొంత నగదు కాలిపోయిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు సభ్యుల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. చోరీ జరిగిన ఏటీఎంలను పరిశీలించిన కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌ చంద్ర.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Leave a Reply