NITI Aayog | కనకదుర్గమ్మ సన్నిధిలో నీతి ఆయోగ్ సీఈఓ

NITI Aayog | కనకదుర్గమ్మ సన్నిధిలో నీతి ఆయోగ్ సీఈఓ

  • అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం..
  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈఓ

NITI Aayog | విజ‌య‌వాడ‌, ఆంధ్ర‌ప్ర‌భ : విజ‌య‌వాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కార్య నిర్వహణ అధికారి శీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు.

నీతి అయోగ్ సీఈఓ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు అమ్మవారి వేదాశీర్వచనం అందచేయగా, ఆలయ ఈఓ అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి ఫోటోతో పాటు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆలయ అధికారులు, అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. దర్శనానంతరం సీఈఓ ఆలయ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ దేవస్థానం అధికారులను అభినందించారు.

Leave a Reply