Nirmala Sitharaman | కాంజీవరం చీరలో ప్ర‌త్య‌క్షం

Nirmala Sitharaman | వెబ్‌డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్ సందర్భంగా నిర్మలమ్మ కాంజీవరం చీరను ధరించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి ఈ చీర ధరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంజీవరం, టస్సర్, లేదా ఇతర ప్రాంతీయ చేనేత కళలను ప్రదర్శిస్తూ, భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఉండే చీరలనే బడ్జెట్ వేళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధరిస్తుంటారు. మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కాంజీవరం పర్పుల్ కాటన్ సిల్క్ చీర ధరించారు.

Leave a Reply