ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
- నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ ; రోగులు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ ,వైస్ చైర్మన్ అప్పల కావ్య,అప్పల గణేష్ అన్నారు. గురువారం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరలకు స్థానికంగా ఉన్న వద్యులు సహకరించాలని కోరారు. వార్డ్ కౌన్సిలర్ సుమలత ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ శిభిరం ఇతరులకు స్ఫూర్తిగా నిలవాళన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న స్వచ్చంద సంస్థ సభ్యులను అభినందించారు.
