అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్‌లో ఆదివారం ఉదయం ఘోరమైన కాల్పులు జరిగాయి. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో, క్రౌన్ హైట్స్ ప్రాంతంలోని ఫ్రాంక్లిన్ అవెన్యూలోని ఓ రెస్టారెంట్‌లోకి ముష్కరులు ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాల్పుల శబ్దం విన్న స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులను గుర్తించడానికి గాలింపు చర్యలు చేప‌ట్టారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

Leave a Reply