Nandigama | 3 నెలలలోనే కొత్త పెన్షన్ మంజూరు

Nandigama | 3 నెలలలోనే కొత్త పెన్షన్ మంజూరు

బాధిత కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Nandigama | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ పట్టణం ఏడవ వార్డు కొత్త బస్టాండ్ సెంటర్‌లో (Center) నిర్వహించిన సామాజిక భద్రతా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. భర్త మరణానంతరం జీవనాధారం కోల్పోయిన మహిళకు కేవలం మూడు నెలలలోపే ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ మంజూరు చేసి, స్వయంగా కూటమి నేతలతో కలిసి లబ్ధిదారులకు స్వయంగా ఆమె అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం (GOVT) వారి పక్కనే నిలబడుతుంద‌న్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, భ‌ర్త చ‌నిపోయిన మ‌హిళ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు అందేలా ప్రతి నాయకుడు, అధికారి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. భర్త మరణించిన వెంటనే సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అర్హత ఉన్న వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల తన నిబద్ధతను చాటిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, వార్డు సభ్యులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ అందుకున్న మహిళ కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply