Network | 300 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌పై నిషేధం

Network | 300 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌పై నిషేధం
Network | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలో పెరుగుతున్న ఆన్‌లైన్ జూదం కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లను అరికట్టేందుకు భారీ స్థాయిలో చర్యలు చేపడుతోంది.
కేంద్ర ప్రభుత్వం అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌పై కొరడా ఝళిపించింది. 300 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌ను నిషేధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిలో ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్, బెట్టింగ్ ఎక్స్ఛేంజీలు, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌లు, రియల్‌మనీ కార్డ్-కెసినో గేమ్ యాప్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు ఇలాంటి 8,400 వెబ్‌సైట్లు, యాప్స్‌ను నిషేధించింది.

