విధుల్లో నిర్లక్ష్యం.. చెట్ల అక్ర‌మ న‌రికివేత‌

జన్నారం, ఆంధ్రప్రభ : విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగంపై ఇద్దరు అటవీ అధికారులను ఉన్న‌తాధికారులు ఈరోజు మ‌ధ్యాహ్నం స‌స్పెండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని రాయకుంట, బంగారుతాండ అడవుల్లో అక్రమంగా టేకు చెట్లను నరికి వేసిన వ్యవహారంలో ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ జి.శ్రీధరచారి, రాయికుంట బీట్ ఆఫీసర్ పి.ప్రణయ్ రెడ్డిలను స‌స్పెండ్ చేస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమే మంచిర్యాల సీఎఫ్, కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ శాంతారాం వ‌ద్ద ఫోన్‌లో ప్ర‌స్తావించ‌గా ఇద్దరు అటవీ అధికారులను సస్పెండ్ చేశామన్నారు.

Leave a Reply