అమరావతికి వైసీపీ వ్యతిరేఖం అని వైఎస్ జగన్ ప్రజల ముందు చెప్పాలి

అమరావతికి వైసీపీ వ్యతిరేఖం అని వైఎస్ జగన్ ప్రజల ముందు చెప్పాలి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలు అర్ద రహితం
ఎన్ టీ ఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను

విజయవాడ, ఆంధ్రప్రభ : వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిపై అవస్తవాలు అసత్యాలు మాత్రమే మాట్లాడారని ఎన్ టీ ఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎన్డీఏ కుటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అమరావతిలో నిర్మాణాలుకొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యే గా గెలిచిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీకి రాకుండా కేవలం విలేకరుల సమావేశాలు నిర్వహించడానికి బెంగళూరు నుండి తాడేపల్లి కాలేజ్ కి రావడం జరుగుతుందన్నారు.

నేడు విలేకరుల సమావేశం నిర్వహించి జగన్ కేవలం అమరావతిపై తన అక్కస్సును వెలగక్కడానికి మాత్రమే ఉందని రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైందన్నారు. ప్లాన్ ఏ లో మూడు రాజధానులు అంటూ మాట్లాడి, నేడు ప్లాన్ బి అని మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటూ యూ టర్న్ తీసుకొని దానికి మరలా “మావిగన్” అంటూ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం ఏ విధంగా అర్థం చేసుకోవాలో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియడం లేదన్నారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మీడియాలో మాట్లాడుతూ తాము రాజధాని అమరావతికి వ్యతిరేఖమని, కచ్చితంగా తాము మరల అధికారంలో వస్తే, శాసన సభలో మరో కొత్త బిల్లు పెట్టి, మారుస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై లేనిపోని వైసీపీ నేతలు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ 25 వ స్థానంలో ఉంటే, నేడు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు దేశంలోనే తొలి స్థానంలో నిలిపారని ఈ సందర్భంగా కొనియాడారు.

పవన్ కళ్యాణ్ ముందు చూపుతోనే పంచాయతీరాజ్ శాఖకు దేశంలోనే తొలి స్థానానికి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ కి వస్తున్న ఆదరణ చూడలేక రోజుకో వైసీపీ నేత విలేకరుల సమావేశం నిర్వహించి విమర్శించడానికి కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అడవి తల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాలకు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలు చేసి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేసి, పూర్తి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు.

Leave a Reply