National Level | గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి

National Level | గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి
- ప్రాక్టీస్ స్పోర్ట్స్ మెన్ ను ఫర్ఫెక్ట్ చేస్తుంది
- నేషనల్ గేమ్స్ నిర్వహిస్తే పూర్తి బాధ్యత తానే తీసుకొంటానని హామీ
- స్టేడియం నిర్మాణానికి తనవంతు కృషి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
National Level | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : క్రీడల్లో పాల్గొనడమే గొప్ప అవకాశమని, అలాంటి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని కృషి పబ్లిక్ స్కూల్(Krishi Public School)లో నిర్వహించిన అర్బన్ మండల స్థాయి క్రీడోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్చ్ ఫాస్ట్ విద్యార్థుల వందన స్వీకారం చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ప్రాక్టీస్ ను పనిగా పెట్టుకుంటే ఎలాంటి క్రీడలోనైనా రాణిస్తారన్నారు. ప్రాక్టీస్, ప్రయత్నాలు క్రీడాకారులకు మంచి ఫలితాలను ఇస్తాయన్నారు. ఈ క్రీడల వల్ల మనకు శారీరక, మానసిక ప్రశాంతతను చేకూర్చుతాయన్నారు. క్రీడల్లో జయాపజయాలు క్రీడాకారులకు జీవితంలోఆటుపోట్లను ఆదిగమించే శక్తిని ఇస్తాయన్నారు.
క్రీడలో ఎంపెయిర్(Empire) తీసుకొన్న నిర్ణయానికి క్రీడాకారులు అనుగుణంగా మెదలాలని, ఎంపెయిర్ నిర్ణయమే తుది నిర్ణయమన్నారు. మన ప్రాంతం గ్రామీణ ప్రాంతమని మన ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు గాను నేషనల్ లెవల్(National Level) క్రీడలు నిర్వహించాలని, ఆ క్రీడల భాద్యత అంత తానే తీసుకొంటానని తెలిపారు.
భీమ్ గల్ పట్టణంలో స్టేడియం నిర్మాణం కు స్థల సమీకరణ లేక నిర్మించలేక పోయామని రానున్న రోజుల్లో భీమ్ గల్ పట్టణంలో స్టేడియం నిర్మానానికి(Stadium Construction) తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా చేశారని, పీఈటీలు ఎప్పుడు మన నియోజకవర్గం లో క్రీడల నిర్వహణ కార్యక్రమం పెట్టిన వారి సొంత పనిలా చేస్తారన్నారు.
ఈ సందర్బంగా క్రీడలకు అతిత్యమిచ్చిన కృషి పబ్లిక్ స్కూల్ యజమాన్యానికి, ఎంఈఓ, పీఈటీలు, క్రీడాకారులకు ప్రశాంత్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎస్ జీ ఎఫ్ గేమ్స్ కన్వీనర్, ఎంఈఓ స్వామి, కో కన్వీనర్ రవీందర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ పెటా ప్రెసిడెంట్ విద్యాసాగర్ రెడ్డి, రమణ ఆర్గనైసింగ్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ పెటా జనరల్ సెక్రటరీ మల్లేష్ గౌడ్, వివిధ పాఠశాల కారస్పాండెంట్ లు షఫీ, ప్రసాద్ రావు, నర్సారెడ్డి, రాజ్ కుమార్, జగదీష్, నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు దొనకంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, భగత్, సతీష్ గౌడ్, బోదిరే నర్సయ్య, బోర్ లింగం, పతని లింబాద్రి, జాగిర్యాల్ సర్పంచ్ గడాల ప్రసాద్, కొత్త తండా సర్పంచ్ తిరుపతి నాయక్ తదితరులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
