Narsingi | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

Narsingi | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…
Narsingi | నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవినేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు తమ్మిరెడ్డి సాయి విగ్నేశ్వర్ రెడ్డి (తండ్రి: జనార్దన్ రెడ్డి) గారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.22,500, బోడికే సాయిరాం, 18 వేల విలువైన చెక్కును భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల పట్టణ శాఖ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, అవసరంలో ఉన్నవారికి ప్రభుత్వం తరఫున అందుతున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే సీఎం ఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించిన ఎంపీ మాధవినేని రఘునందన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నార్సింగి మండల పట్టణ శాఖ ప్రజాసేవలో ముందుంటూ ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
