విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి..

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి..
నార్సింగి, ఆంధ్రప్రభ : శుభకార్యానికి వచ్చిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన నార్సింగి పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మెడ్చల్ మండలం అత్వెల్లి గ్రామానికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి (40) బంధువుల పెళ్లి కోసం నార్సింగికి వచ్చాడు. ఉదయం ఇంటి ముందు వైర్‌పై బట్టలు ఆరబెట్టే సమయంలో సమీప ఇంటి నుంచి ఆ వైర్‌కు విద్యుత్ కనెక్షన్ ఉండటంతో షాక్ తగిలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు తమ్మారెడ్డి భూపాల్ రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సృజన తెలిపారు.
