Telangana | ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం

Telangana | ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం

Telangana | నెక్కొండ, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం సాధ్యమవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి (Donthi Madhav Reddy) అన్నారు. నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పూర్తయిన సందర్భంగా గృహప్రవేశానికి హాజరై ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల (Indiramma’s house) తో నిరుపేద కుటుంబాల సొంతింటి నిర్మాణ కల సాకారమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉండి వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపల్లి దేవేందర్రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కీ అశోక్, డిసిసి ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, కోశాధికారి సుబ్బారెడ్డి, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మరెడ్డి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సాయికృష్ణ, ఉపాధ్యక్షులు హనుమంతరావు, భాను, బండి శివ, మైపాల్ రెడ్డి, కొమురయ్య, రమేష్, ఖలీల్, రత్నం, పాపిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగం ప్రశాంత్, తిరుపతిరెడ్డి, అన్వర్, షబ్బీర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply