Narasampeta | ప్రిన్సిపాల్ కు షో కాజ్ నోటీస్

Narasampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం విద్యార్థులు ఘర్షణ పడి కొట్టుకున్న విషయంలో ప్రిన్సిపాల్ కు షో కాజ్ నోటీసు ఇచ్చినట్లు వరంగల్ కరీంనగర్ జిల్లాల గిరిజన గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న తెలిపారు. విద్యార్థుల మధ్య ఘర్షణ విషయంలో పూర్తి చేసినట్లు తెలిపారు. 9వ తరగతి చదువుతున్న దీపక్ అనే విద్యార్థికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు వివరించారు. విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. ఘర్షణకు కారణమైన ఇంటర్ విద్యార్థులను వారి తల్లి ఇలాంటి పరిస్థితులు మరోసారి ఏర్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలిపారు. గురుకులంలో బాధ్యులైన పాఠశాల సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్ వెంకన్న వివరించారు. ఘర్షణకు దారి తీసిన పరిస్థితులపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తున్నట్లు డి.ఎస్ వెంకన్న వివరించారు.
