నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో.. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌తో ప్రకటించారు. ఈ గ్లింప్స్ తో సినిమా ట్రైలర్ ను మార్చి 7న విడుదల చేస్తున్నట్టు రివిల్ చేశారు మేకర్స్.
శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.