Nandyala | పేదల కోసం..

Nandyala | పేదల కోసం..
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత కమ్యూనిస్టు పార్టీ పేదల కోసం పాటుపడింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే.. శుక్రవారం సిపీఐ 101 వ ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమానికి సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పతావిష్కరణ కార్యక్రమానికి నాయకులు సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సీపీఐ జిల్లా నాయకులు మురళీధర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు, భాస్కర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, లక్ష్మీదేవి ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, సీపీఐ పట్టణ నాయకుడు ధనుంజయ్, మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు హరినాథ్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం.. ముక్తి కోసం.. పేద ప్రజల సంక్షేమం కోసం.. నిరంతరం పోరాటాలు నిర్వహించిన ఏకైక పార్టీ సీపీఐ పార్టీ అన్నారు. దేశంలో నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సీపీఐ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభించిన ఘనత కమ్యూనిస్టు పార్టీకే దక్కిందని అన్నారు. దేశంలో రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు సాధనలో పోరాటాలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడిన పార్టీ సీపీఐ అని అన్నారు. వెట్టిచాకిరి విముక్తికై నిరంకుశ నైజాం నవాబును గద్దె దించడానికి మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీపీఐ శాఖ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, మహిళా సమాఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
