పెద్ద ప్రమాదం తప్పింది…

పెద్ద ప్రమాదం తప్పింది…

ఆర్టీసీ బస్సులో మంటలు… అప్రమత్తమైన సిబ్బంది..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు లో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. అప్రమత్తమైన కండక్టర్ డ్రైవర్ బస్సులు ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపిన సంఘటన నంద్యాల జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారులు తెలిపిన రూరల్ మేరకు నంద్యాల నుంచి బేతంచెర్ల వెళుతున్న ఆర్టీసీ బస్సుల్లో సిమెంట్ నగర్ బస్సు స్టేషన్ వద్ద ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగా యి. ప్రయాణికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. బస్సు నిండా నల్లటి పొగ నిండుకుపోయింది. ఆర్టీసీ డ్రైవర్ జిల్లాని కండక్టర్ శేషన్న లు అప్రమత్తంగా వ్యవహరించారు. బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా దింపి మంటలను ఆర్పి వేశారు.

అనంతరం మరమ్మతుల కోసం బస్సులు బేతంచెర్ల డిపోకు తరలించారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వేసవి కాలం రాకముందే బస్సులో నుంచి కూడా మంటలు చెలరేగటం ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు భవిష్యత్తులో మరిన్ని ఏ ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. బస్సులను కనీసం మరమ్మతులు చేసి వేడి నుంచి కాపాడేందుకు బస్సు టాపులపైన చల్లనీటితో ఏర్పాటు చేసిన కార్పన్లు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply