శ్రీశైలం మహానంది ఆలయాలు కు తాళాలు..

శ్రీశైలం మహానంది ఆలయాలు కు తాళాలు..
చంద్రగ్రహణం కారణంగా ఆలయద్వారాలు మూసివేత…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ దేవాల యాలు శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం లోను, మహానందిలో శ్రీ మానందేశ్వర స్వామి దేవస్థానంలోనూ చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 6 గంటలకు ల నుండి ఆలయద్వారాలు మూసివేత కార్యక్రమాన్ని చేపట్టారు.రాత్రి 7.30 గంటలకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ, పూజాదికాలు చేపడతామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రాత్రి గం. 9.00లకు శ్రీస్వామిఅమ్మవార్లకు మహామంగళహారతుల కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాదికార్యక్రమాలు నిర్వహించి రాత్రి గం.9.00లకు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు జరిపించబడుతాయన్నారు.

అవకాశం మేరకు మహామంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి గం.9.00ల నుండి రాత్రి గం. 10.00ల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించబడుతాయి. కాగా ఈ రోజు ఉదయం గం. 3.00లకు ఆలయద్వారాలు తెరచి మంగవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత: కాలపూజలు, మహామంగళహారతులు జరిపించబడ్డాయన్నారు. మహామంగళ హారతులు సమయం నుంచే అనగా గం. 4. 30ల నుంచి గం. 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించబడిందన్నారు. గ్రహణం కారణంగా ఆలయప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు మరియు సాక్షిగణపతి, హాఠకేశ్వరం – ఫాలధార పంచధార మరియు శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు కూడా మూసివేయబడ్డాయన్నారు. గ్రహణం కారణంగా ఈ రోజు అన్నప్రసాదవితరణ కూడా నిలుపుదల చేయబడిందన్నారు.
