Nandyala | బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..

Nandyala | బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల, చిత్తూరు జాతీయ రహదారి పై శుక్రవారం ఉదయం నంద్యాల దగ్గర చాబోలు మెట్ట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అతి స్పీడు వలనే ఈ ప్రమాదం సంభవించిది. ఈ ప్రమాదంలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నెల్లూరు నుంచి కర్నూలుకు వెళుతుంది. ప్రైవేట్ బస్సు నెంబర్ ఏ ఆర్ 01జె 5302. టైర్లు స్కిడ్ అయి బస్సు తిరిగి పడింది. బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీటిలో ఆరుగురుకు తీవ్ర గాయాలు అయ్యా యి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నంద్యాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
