Nandigama | అవ‌గాహ‌న అవ‌స‌రం..

Nandigama | అవ‌గాహ‌న అవ‌స‌రం..

  • విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతా నియమాలు తెలుసుకోవాలి..
  • నందిగామ ఆర్‌టీవో వై. పూర్ణిమ

Nandigama | (నందిగామ, ఆంధ్రప్రభ) : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నందిగామ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఈ రోజు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాలేజీ విద్యార్థులు, ట్రైన్డ్ వాలంటీర్లతో కలిసి వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రాంతీయ రవాణా అధికారి వై. పద్మావతి మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను అనుసరించి తమ ప్రయాణాలను సురక్షితంగా చేసుకోవాలని సూచించారు.

Nandigama

ఆర్టీవో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాలు, హెల్మెట్ ధరించాల‌ని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు, కార్లో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని హెచ్చరించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడపడం ప్రమాదకరమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి బీఎస్‌కే ప్రభాకర లింగం, హెచ్‌ఆర్ మోటార్స్ రీజినల్ ట్రైనర్ (ఆంధ్రప్రదేశ్) వైఎన్ జగదీష్, చైతన్య జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులు, పీఎస్‌సీ బోస్, అన్నపూర్ణ డ్రైవింగ్ స్కూల్ ట్రైన్డ్ వాలంటీర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply