Nagar Kurnool | కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

Nagar Kurnool | కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ
Nagar Kurnool | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇటీవలే నాగర్ కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సంగ్రామ్ సింగ్ గణపట్ రావు(Sangram Singh Ganpat Rao) పాటిల్ ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు.
జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు, శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ కార్యక్రమాల అమలు, ప్రజా సేవల సమన్వయం వంటి అంశాలపై ఎస్పీ కలెక్టర్ చర్చించారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి హైదరాబాద్ సీఐడీ డీసీపీ(CID DCP)గా విధులు నిర్వహిస్తూ నాగర్ కర్నూలు జిల్లా(Nagar Kurnool District)కు ఇటీవలే జిల్లా ఎస్పీగా వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.
