Nagar Kurnool | నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

Nagar Kurnool | నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

  • 550 పడకల ఆసుపత్రి నిర్మాణం
  • రూ. 235 కోట్ల నిధుల మంజూరు
  • 24 నెలల్లో పనులు పూర్తి
  • నాగర్కర్నూల్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

Nagar Kurnool | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాల లో మెడికల్ ఆసుపత్రి 550 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన పనులను ప్రారంభించారు. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాలలో రూ. 235 కోట్ల నిధులతో చేపడుతున్న 550 మెడికల్ పడకల భవన నిర్మాణ పనులను కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Nagar Kurnool

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం వ్యవసాయం ప్రాధాన్యతతో అభివృద్ధి పనులను చేపడుతున్నదని అన్నారు. అందులో భాగంగా నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలకు మంజూరైన రూ. 235 కోట్ల నిధులతో 550 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగిందని ఈ పనులను 24 నెలల్లో పూర్తి చేస్తామని రాజేష్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు రూ. 1000కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శంకుస్థాపనలే కాదు పనులు కూడా చేపడుతున్నామని ఈ అపోహను తొలగించుకోవాలని పనులు చేపట్టి అభివృద్ధి చూపిస్తామని హామీ ఇచ్చారు.

Nagar Kurnool

నాగర్కర్నూల్ పట్టణంలో నూతన బస్టాండు నిర్మాణం, నూతన కళాశాల భవన నిర్మాణం, రోడ్లు 55 కోట్లతో చేపడుతున్నామని వివరించారు, ఇవే కాకుండా పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి ఆసుపత్రి సూపర్డెంట్ ఉషారాణి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ యాదగిరిరావు, డైరెక్టర్ గౌతమ్ సైట్ ఇంజనీర్ సురేందర్ రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్లు నాయకులు ఆసుపత్రి నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply