Muthukur | వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త అవ‌స‌రం

Muthukur | వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త అవ‌స‌రం

  • గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం ప్రారంభం

Muthukur | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో శనివారం ముస్తాబు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత, మండల విద్యాశాఖ ఉన్నతాధికారులు మధుసూదన్, హేమ సుందర్‌లు సంయుక్తంగా ప్రారంభించారు. విద్యాశాఖ మండల అధికారులు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత ఉన్నప్పుడే క్రమశిక్షణ ఏర్పడుతుందని తెలియజేశారు. విద్యార్థినిలు ముస్తాబు కార్యక్రమాలను అనుసరిస్తూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఎస్ఎంసీ పాలకవర్గం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply