Murder | రూ.10ల కోసం హత్య

Murder | రూ.10ల కోసం హత్య
Murder | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ (Vijayawada) లోని కొత్తపేట ప్రాంతంలోని చిట్టినగర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం కోసం రూ.10 ఇవ్వలేదని ఓ బాలుడు విచక్షణా రహితంగా కత్తి (knife) తో పొడిచి తాతాజీ అనే వ్యక్తిని హత్య చేశాడు. బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హంతకుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రాంతంలో కలకలం రేపింది.
