Murder @ 10 ₹ : బెజవాడలో దారుణం Andhra Prabha News
Rs10/- కోసం ప్రాణం తీసిన మైనర్
బెజవాడలో హృదయ విదారక ఘటన…
పది రూపాయల కోసం ఐదు కత్తిపోట్లు పొడిచిన బాలుడు..
కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అమానుష ఘటన..
నిమిషాల వ్యవధిలో నేరస్తులను పట్టుకున్న పోలీసులు..
నేరస్థుని పట్టుకోవడం వల్ల కీలక పాత్ర పోషించిన సీసీ కెమెరా…
Murder @ 10 ₹– | విజయవాడ (క్రైమ్), ఆంధ్రప్రభ : మద్యం కొనడానికి పది రూపాయలు తక్కువ అయ్యాయనే చిన్న కారణమే ఒక మనిషి ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశం, మద్యం మత్తు కలిసి ఒక మైనర్ బాలుడిని హంతకుడిగా మార్చగా, విజయవాడ టూ టౌన్ (Vijayawada Two Town) పరిధిలోని సొరంగం రోడ్డులో దారుణ హత్య (Brutal murder) కు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Murder @ 10 ₹ : అవమానాన్ని జీర్ణించుకోలేక
గురువారం రాత్రి సుమారు 9గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మైనర్ బాలుడు (Minor boy) మద్యం సేవించాడు. రాత్రి 10:30 గంటల సమయంలో మద్యం (Murder @ 10 ₹ )కొనడానికి రూ.10 తక్కువ కావడంతో హెచ్‌ఎస్ ఫ్యాషన్ మగ్గం వర్క్‌షాప్ ముందు కూర్చుని ఉన్న పలకా తాతాజీని డబ్బులు అడిగాడు. దీనిపై తాతాజీ అతన్ని తిట్టి రెండు దెబ్బలు వేశాడు. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక, మద్యం మత్తులోనే ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చిన బాలుడు, అప్పటికే వరండాలో నిద్రలో ఉన్న తాతాజీ ఛాతీలో ఐదు కత్తి పోట్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
హెచ్‌ఎస్ ఫ్యాషన్ వర్క్‌షాప్ (HS Fashion Workshop) ముందు ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు గుర్తించారు. స్థానికుల విచారణలో మృతుడిని పలకా తాతాజీ (48), కులం పద్మశాలి అని గుర్తించారు. మద్యంకు బానిసై కుటుంబానికి దూరంగా జీవిస్తూ, పగటిపూట పనిచేసి రాత్రి అదే వరండాలో నిద్రపోయే వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
మృతుడు రాత్రి 11గంటల వరకు బ్రతికే ఉన్నాడని, 11:20 గంటల సమయంలో మృతదేహంగా చూశామని ఒక స్థానికుడు సమాచారం ఇవ్వడంతో, ఈ 20 నిమిషాల వ్యవధిలోనే హత్య ( murder) జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
Murder @ 10 ₹ : మైనర్ బాలుడిగా గుర్తించి

ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న పశ్చిమ ఏసీపీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ (CCTV camera footage) ను క్షుణ్ణంగా పరిశీలించారు. టీహెచ్ఎం స్కూల్ అడ్డరోడ్ వైపు ఒక బక్కపలచని వ్యక్తి కంగారుగా పరుగెత్తుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించడంతో అనుమానం బలపడింది. కెమెరాల ట్రాకింగ్ ద్వారా అతను లంబాడి పేట వరకు వెళ్లినట్లు గుర్తించారు. సీసీటీవీ ఆధారాలతో పాటు స్థానిక సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడు ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే ఒక మైనర్ బాలుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని పూర్తిగా అంగీకరించాడు.
click here to read 19 పసిగుడ్లు అమ్మేసింది Andhra Prabha SPL Story

