Municipal Elections | తాజా మాజీ కౌన్సిరల్లు దూరం..?

Municipal Elections | తాజా మాజీ కౌన్సిరల్లు దూరం..?

Municipal Elections, మోత్కూర్, ఆంధ్ర ప్రభ : మోత్కూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత పాలకవర్గ హయాంలో కౌన్సిలర్ లుగా పని చేసిన ప్రస్తుత తాజా మాజీ కౌన్సిలర్లు ఈ దఫా మున్సిపల్ ఎన్నికలకు ఆయా వార్డుల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 12 వార్డుల్లో కేవలం 5వ వార్డు లో మలిపెద్ది రజిత, 9 వ వార్డులో డా గుర్రం లక్ష్మీనరసింహరెడ్డి (మాజీ ఛైర్మన్ కవిత భర్త), 12 వ వార్డులో కూరేళ్ల కుమారస్వామిలు మాత్రమే బరిలోకి దిగారు.

మినహా 9 మంది కౌన్సిలర్లు తమ తమ వార్డులలో రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడం, ఆర్ధిక భారం, ఆయా పార్టీలలో పార్టీ టికెట్లు రాకపోవడం, ఎస్సీ మహిళ చైర్మన్ కి రిజర్వ్ కావడంతో పలు జనరల్ స్థానాల్లో సైతం ఎస్సీ అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్ పీఠం పై ఆశలు పెట్టుకొని పోటీకి నిలబడడంతో తాజా మాజీ కౌన్సిలర్లతో పాటు, గతంలో గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి చవి చూసిన అభ్యర్థులు సైతం పలువురు పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఈ దఫా తాజా మాజీ కౌన్సిలర్లు మళ్లీ పాలకవర్గంలోకి వస్తారా… లేదా..? అని మున్సిపల్ ఓటర్లు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

సానుభూతి పవనాలు వీచేనా…?
2020 ఎన్నికల్లో కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు సైతం ఈసారి మళ్లీ కౌన్సిలర్లుగా పోటీకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దీంతో వార్డులలో వారికి సానుభూతి పవనాలు వీస్తాయా..లేదా ..? అన్న కోణంలో ఆలోచనలో పడ్డారు. గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన 2 వ వార్డు కూర్మిళ్ల ప్రమీల రాములు (కాంగ్రెస్), 4 వ వార్డులో తొంట రేణుక భాస్కర్ (కాంగ్రెస్), 5 వ వార్డు మొగుళ్ళ అనురాధ (బీఆర్ఎస్), 7 వ వార్డులో పల్లపు స్వరూప సమ్మయ్య (కాంగ్రెస్), 8వ వార్డులో అవిశెట్టి అవిలిమల్లు భార్య పద్మ(కాంగ్రెస్), 11వ వార్డులో పసల విజయ మరియన్న(బీఆర్ఎస్), గుండగొని రామచంద్రు(1 వ వార్డులో ఓటమి, కాంగ్రెస్), 12 వ వార్డులో మెంట నగేష్ భార్య రమణ (కాంగ్రెస్) లు ఈ దఫా కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు వేసి ఆయా వార్డులలో బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కౌన్సిలర్ రేసులో సినీ గేయ రచయిత భార్య…!
తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లో ఉదయించిన కిరణమా..! అంటూ పోరాటానికి ఆజ్యం పోసిన ప్రముఖ సినీ గేయ రచయిత, మోత్కూర్ మున్సిపాలిటీ మాజీ బ్రాండ్ అంబాసిడర్ అభినయ శ్రీనివాస్ భార్య దొంతోజు శ్రీలత (బీఆర్ఎస్) 7 వ వార్డులో కౌన్సిలర్ గా బరిలో ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Leave a Reply