Mukkoti Ekadashi | బారులు తీరిన భక్తులు

Mukkoti Ekadashi | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని కోడూరు వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకోవడానికి వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరారు. గరుడ వాహనం పై శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొలువుదీరారు. ఆలయ అర్చకులు దుంబాల శ్రీధరాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి మూలవిరాట్ కు చేసిన విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ కోట పద్మావతి వరప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply