mrunalthakur | సోషల్ మీడియాలో సెగలు

mrunalthakur | సోషల్ మీడియాలో సెగలు

mrunalthakur | టాలీవుడ్ ‘సీతమ్మ’ మృణాల్ ఠాకూర్
నెటిజన్లకు ఫుల్ వైబ్స్
ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ అవార్డు
మృణాల్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టాలీవుడ్ ‘సీతమ్మ’ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది! తన లేటెస్ట్ ఫోటోషూట్‌లో కిల్లర్ లుక్స్‌తో మెరిసిపోతూ అభిమానుల మనసు దోచుకుంటోంది. ఆమె ఇచ్చిన స్టయిలిష్ పోజులు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అటు ‘సీతారామం’ వంటి క్లాసిక్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటూనే, ఇటు గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజన్లకు ఫుల్ వైబ్స్ ఇస్తోంది ఈ బ్యూటీ. మృణాల్‌కు తెలుగు ప్రేక్షకులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన ‘సీతారామం’ సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది.

ఆ సినిమాలో సీతగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనలోనూ తనకు సాటిలేరని ఈ ముద్దుగుమ్మ నిరూపించుకుంది. ప్రస్తుతం మృణాల్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.

mrunalthakur
mrunalthakur

click here for more cinema

click here for more movie articles

Leave a Reply