Mrunal Thakur | డెకాయిట్‌తో సక్సెస్ సాధించేనా..?

Mrunal Thakur | డెకాయిట్‌తో సక్సెస్ సాధించేనా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ తో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు యంగ్ హీరో అడివి శేష్. ఆయన నటిస్తున్న కొత్త సినిమా డెకాయిట్. ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ దొంగ జంట కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దాంతో హీరో అడివి శేష్, ఇతర టీమ్ మెంబర్స్ మృణాల్ కు సెండాఫ్ ఇచ్చారు. మృణాల్ తో టీమ్ అంతా పిక్స్ తీసుకున్నారు. అయితే.. ఈ సినిమా పై మృణాల్ చాలా నమ్మకం పెట్టుకుంది. మరి.. ఈ బ్యూటీ నమ్మకం నిజమయ్యేనా..?

Mrunal Thakur

డెకాయిట్ లో మొదట హీరోయిన్ గా శ్రుతి హాసన్ ని తీసుకున్నారు. ఆమెతో కొంత షూటింగ్ చేశాక డేట్స్ క్లాష్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. శ్రుతి హాసన్ క్యారెక్టర్ లో మృణాల్ ను తీసుకున్నారు. ఆమె కూడా ఈ క్యారెక్టర్ కు పర్పెక్ట్ కుదిరింది. స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంటే తన క్యారెక్టర్ వరకు మృణాల్ ఠాకూర్ ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది. సీతారామం, ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న వంటి సినిమాల్లోనూ ఇది ప్రూవ్ అయ్యింది. ఆమె ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందనే పేరు తెచ్చుకుంది. అందుకనే.. ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ అయినా.. ఆమె పర్ ఫార్మెన్స్ కు మాత్రం మంచి పేరు వచ్చింది.

Mrunal Thakur

ఇప్పుడు మృణాల్ నటిస్తున్న డెకాయిట్ అనే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్స్‌ పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న డెకాయిట్ సినిమా మార్చి 19న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన డెకాయిట్ టీజర్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుంది.. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతుందనే ఫీలింగ్ అండ్ బజ్ క్రియేట్ చేసింది. మరి.. మృణాల్ నమ్మకం నిజమై.. సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

Mrunal Thakur

CLICK HERE TO READ బాబాయ్ – అబ్బాయ్ కాంబో మూవీ..?

CLICK HERE TO READ MORE

Leave a Reply