ప్రారంభించిన ఎమ్మార్వో ప్రభుదాస్
మెదక్, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎమ్మార్వో ప్రభుదాస్, ఎంపీడీవో ఆనంద్, ఆర్ఐ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే వడ్ల ధర చెల్లిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి భరత్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి దివ్య, సీసీ శోభ పాల్గొన్నారు.