చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎంపిడివో

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం నాగపూర్ గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా చెలివేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఎండల్లో ఎక్కువ తిరగవద్దని,వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంపదండి అశోక్,సెక్రెటరీ కాందేశ్ సంధ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
