Mp | కూటమి ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం

Mp | కూటమి ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం
Mp | మొవ్వ, ఆంధ్రప్రభః రాష్ట్రంలో అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి తెలిపారు. మొవ్వలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.
పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం నాకెంతో సంతోషకరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక సంఖ్యలో నిధులు తీసుకువచ్చి ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. అనంతరం మొవ్వలోని విఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
