MovieFans | సినిమా హిట్ ఫ్లాప్‌ను నిర్ణయించేది హీరోలు కాదు..

MovieFans | సినిమా హిట్ ఫ్లాప్‌ను నిర్ణయించేది హీరోలు కాదు..
MovieFans | ఫ్యాన్స్ చేతిలో సినిమా భవిష్యత్తు
దర్శకులపై పెరుగుతున్న ఒత్తిడి
ట్రైలర్ హైప్.. సినిమా ఫలితం మధ్య గ్యాప్
మారుతున్న సినీ ట్రెండ్ – ఫ్యాన్స్ రాజ్యం
MovieFans | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సినిమా ఎలా ఉండాలో నిర్ణయించేది హీరోలు కాదంటా, అభిమానులే సినిమాను నిర్ణయిస్తున్నారు అంటా… వారి కోరిక మేరకు నడుస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పటి సినిమా ప్రపంచంలో హీరోల కంటే ఎక్కువ ఒత్తిడి దర్శకులపైనే పడుతోంది.
సినిమా బాగుంటే హీరోతో పాటు దర్శకుడిని ఆకాశానికెత్తేస్తారు. కానీ సినిమా అంచనాలకు అనుగుణంగా లేకుంటే అభిమానుల కోపానికి దర్శకుడే బలి అవుతున్నాడు. చిన్న సినిమాలు మంచి కథతో వచ్చినా, వాటిని పట్టించుకునే వారు తక్కువ. కానీ పెద్ద హీరో సినిమా అయితే అభిమానుల అంచనాలు ఎప్పుడూ ఆకాశమంత ఉండడంతో దర్శకులు అది జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇటీవల రాజసాబ్ సినిమా ట్రైలర్‌తో భారీ హైప్ తీసుకొచ్చిన దర్శకుడు, సినిమాలో ఆ రేంజ్ లేకపోవడంతో అభిమానుల ఆగ్రహానికి తట్టుకోలేకపోయాడు. మారుతి కన్నా ముందు రాధే శ్యామ్‌తో రాధాకృష్ణ కుమార్, ఆదిపురుష్‌తో ఓం రౌత్, వినయ విధేయ రామతో బోయపాటి, గుంటూరు కారంతో త్రివిక్రమ్ శ్రీనివాస్, కింగ్‌డమ్‌తో గౌతమ్ తిన్ననూరి ఇలా ఎంతోమంది ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనయ్యారు.
సినీ రంగంలో ఒకప్పుడు హీరో హావభావాలు, లుక్ దృష్టిలో పెట్టుకుని కథ రాసేవారు. కానీ ఇప్పుడు హీరోకన్నా ముందుగా అభిమానుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని కథ నిర్మించాల్సిన కాలం వచ్చింది. ఫ్యాన్స్ ఆనందిస్తే హిట్, లేకపోతే సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ. మొత్తం మీద, స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు హీరో-డైరెక్టర్‌లవి మాత్రమే కాదు… అభిమానుల సంకల్పం కూడా కీలకం అనేది ప్రస్తుత ట్రెండ్. హీరోలు సైతం అభిమానుల వ్యతిరేకతను ఎదుర్కోలేని పరిస్థితి కనిపిస్తోంది.
