Move | ముగిసిన పోలింగ్ …బ్యాలెట్ బాక్స్ లు తరలింపు..

Move | ముగిసిన పోలింగ్ …బ్యాలెట్ బాక్స్ లు తరలింపు..
అభ్యర్థుల్లో ఉత్కంఠ… బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం..? అంచనాల్లో రాజకీయ విశ్లేషకులు… గెలుపు ధీమాలో ఆయా పార్టీలు
Move | మోత్కూర్, ఆంధ్రప్రభ; మోత్కూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది . దీంతో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలోని 26 పోలింగ్ కేంద్రాల నుండి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రితో పోలింగ్ అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య 7 వాహనాల్లో భువనగిరిలోని వలిగొండ రోడ్ లోని దివ్య బాల పాఠశాలకు తరలించారు. ఆయా వార్డుల పరిధిలోని అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లలో బ్యాలెట్ బాక్స్ లను భద్రపరచనున్నారు.
బ్యాలెట్ బాక్స్ ల్లో అభ్యర్థుల భవితవ్యం…?
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ కాస్త ముగియడంతో.. అభ్యర్థుల్లో కొంతమేరకు ఉపశమనం కలిగినప్పటికీ, అసలైన ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది .బ్యాలెట్ బాక్స్ లో వారి భవితవ్యం దాగి ఉండడంతో, ఈ నెల 13న జరిగే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై అభ్యర్థుల్లో ఉత్కంఠ తీవ్రం కానుంది . ఆయా పార్టీల అధిష్టానం, రాజకీయ విశ్లేషకులు అభ్యర్థుల గెలుపు,ఓటము లపై పోలింగ్ అనంతరం తమ తమ అంచనాల్లో ఉన్నారు. తమకు ఇన్ని సీట్లు వస్తాయని ఆయా పార్టీలు ఎవరికి వారే గెలుపు ఓటములపై ధీమాగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికి.. మోత్కూర్ మున్సిపాలిటీలో ప్రధానంగా కాంగ్రెస్ , బిఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోరు కొనసాగింది.కేవలం 12 వ వార్డు లో కాంగ్రెస్, బి ఆర్ ఎస్,స్వతంత్ర అభ్యర్థి మధ్య త్రిముఖ పోటీ ఉందని,ఆ వార్డులో సైలెంట్ ఓటింగ్ జరిగినట్లు, ఓటర్ నాడి అంతుచిక్కడం లేదని సమాచారం. ఎట్టకేలకు చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కి వరిస్తుందా… బిఆర్ఎస్ పార్టీకి వరిస్తుందా…? అని రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఆలోచన లో పడ్డారు.
