Motors Panel | రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు..

Motors Panel | రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు..

Motors Panel | దండేపల్లి, ఆంధ్రప్రభ : యాసంగి సీజన్ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా, రైతులు నార్లు వేసుకున్నా ఇప్పటికీ గూడెం ఎత్తిపోతల నుండి రైతులకు సాగు నీరు విడుదల చేయకపోవడంతో ఈ రోజు దండేపల్లి మండలం గూడెం లిఫ్ట్ ను బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి సందర్శించారు. సంబధిత అధికారులతో నీటి విడుదల జాప్యం పై అడిగితెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మోటార్ల ప్యానెల్(Panel of motors) పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగు నీరు విడుదల చేయాలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎలక్ట్రిక్ ప్యానల్ పనులు ప్రారంభం అయ్యి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగు నీరు అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో రైతులకు సాగు నీరు అందించక మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గత రెండు సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం(Government) యుద్ధప్రాతిపదికన కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి జనవరి 5వ తేదీలోగా పనులు పూర్తి చేసి దండేపల్లి, లక్షేట్టిప‌ల్లి, హాజీపూర్ మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. సరైన సమయంలో సాగు నీరు విడుదల చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మాధవరపు వెంకట రమణ రావు, బందేల రవి గౌడ్, గడ్డం స్వామి రెడ్డి, గోపతి రాజయ్య, వీరమల్లు హరి గోపాల్, ఎనగందుల కృష్ణ మూర్తి, బియ్యాల సతీష్ రావు, రమేష్ జైన్, బేతు రవి, మొరుపుటాల తులసి,గాలిపేల్లి సత్యనారాయణ, పత్తిపాక సంతోష్, బత్తుల శేఖర్, గడికొప్పుల సురేందర్, పయ్యావుల నాగేందర్, చుంచు గిరిధర్, దుమ్మని సత్తయ్య, కరుకూరి మధుకర్, కాండ్రపు వంశీ, కిరణ్, ధార శేఖర్, వనపర్తి రాకేష్, బొలిశెట్టి అశ్విన్, అజ్మీరా ఈశ్వర్ నాయక్, పెట్టం శ్రీరామ్, మడిపెల్లి సత్యం, కొట్టే ప్రశాంత్, ముత్తె వెంకటేష్, హనుమాండ్ల శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply