Mothkur | శివయ్య అలంకరణ..

Mothkur | శివయ్య అలంకరణ..

  • శివరాత్రి వేడుకలు.. భక్తుల రద్దీ..
  • పెద్దమ్మ ఆలయంలో విభూతి భస్మం తో శివ లింగ అలంకరణ..
  • మారుమ్రోగుతున్న శివనామ స్మరణ..

Mothkur, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం, పెద్దమ్మ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు మండలంలోని ఆయా శైవ క్షేత్రాల్లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వేకువజాము నుండే భక్తులు పెద్దఎత్తున శివయ్య దర్శనం కోసం శివ భక్తులు బారులు తీరుతున్నారు. ఆయా ఆలయాల్లో శివ లింగాలను పురోహితులు విభూతి భస్మంతో భక్తుల దర్శనార్థం అందంగా అలంకరించారు.

దీంతో ఆయా ఆలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చనలు నిర్వహిస్తూ కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉపవాస దీక్షలు పాటిస్తూ శివయ్య పై తమ భక్తిశ్రద్ధలను చాటుకుంటున్నారు.

Leave a Reply