Mothkur | కౌన్సిలర్ బరిలో.. కమ్యూనిస్టులు..!

Mothkur | కౌన్సిలర్ బరిలో.. కమ్యూనిస్టులు..!
- కాంగ్రెస్ తో సీపీఐ… బీఆర్ఎస్ తో సీపీఎం పొత్తులు..
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ స్థానాల్లో కమ్యూనిస్టులు బరిలోకి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో, బీఆర్ ఎస్, సీపీఎంతో జతకట్టాయి. మున్సిపల్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 5 వ వార్డులో సీపీఐకి చెందిన మొగుళ్ళ స్వాతి శేఖర్ రెడ్డికి, 8 వ వార్డులో బీఆర్ ఎస్ పార్టీ సీపీఎం కి చెందిన కూరపాటి జయమ్మ రాములుకి కేటాయించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో 5, 8 వార్డులలో కమ్యూనిస్టు అభ్యర్థులు ఆయా పార్టీల మద్దతుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
5 వ వార్డులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మలిపెద్ది రజిత రాంరెడ్డి (మాజీ కౌన్సిలర్), బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా మొగుళ్ళ అనురాధ (గతంలో పోటీ చేసి ఓటమి చెందిన) ఇరువురు అభ్యర్థులు రెబల్స్ గా బరిలో ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇదే వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన రజిత, అనురాధలు ఇరువురు మళ్లీ పోటీలో ఉండడంతో ఏం జరుగుతుందోనని స్థానిక ఓటర్లు నిశితంగా పరిశీలిస్తుండగా… రాజకీయ మేధావులు మాత్రం మిన్నకుండా ఉన్నారు. జనరల్ మహిళకి చెందిన ఈ వార్డులో చైర్మన్ పదవి పై ఆశతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కోక రేణుక బిక్షంకి బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది.
