ఇద్దరు బిడ్డలతో  అమ్మ ఆత్మహత్య

తిరుపతి జిల్లా ఉగ్గుమూడిలో  విషాదం

( ఆంధ్రప్రభ,  సూళ్లూరుపేట)

 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడి గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో మానసికంగా కలతచెందిన ఉగ్గుమూడి గ్రామానికి చెందిన ఉగ్గుమూడి వరలక్ష్మీ(24) అనే వివాహిత మహిళ కుమార్తె వర్షిత (4), కుమారుడు ప్రశాంత్ (2) ఇద్దరు చిన్నారులతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామమంతా షాక్‌కు గురైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారిని స్ధానికుల సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply