మ‌రింత అభివృద్ధి

  • సెంటిమెంట్ రాజ‌కీయంతో అభివృద్ధి జ‌ర‌గ‌దు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిని గెలిపించి త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని, నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తామ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్ర‌భాకార్(Minister Ponnam Prabhakar) అన్నారు. ఈ సంద‌ర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెంటిమెంట్‌ రాజకీయంతో అభివృద్ధి జరుగదని చెప్పారు. బీఆర్ఎస్(Brs) నేతలు వారి రాజకీయాల కోసం.. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు.

కంటోన్మెంట్ ఓటర్ల చైతన్యం జూబ్లీహిల్స్‌లోనూ రావాలని పొన్నం ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సొంత నేతలకు సూచించారు. నూతన రేషన్ కార్డులు( Ration Cards), సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లో ఆరు వేల కొత్త రేషన్‌కార్డులు ఇచ్చినట్లు తెలిపారు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ ఎర్రగడ్డ(Erragadda) డివిజన్‌లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని 2.16 కోట్ల రూపాయలతో నటరాజ్ నగర్, శంకర్‌లాల్ నగర్(Shankarlal Nagar), ఛత్రపతి శివాజీ నగర్ వద్ద సీసీ రోడ్లు వేయడం, నటరాజ్ నగర్, బంజారా నగర్, కమ్యూనిటీ హాల్‌ల పునరుద్ధరణకు శంకుస్థాప‌నులు చేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మీర్జా రహమత్ బెగ్ ఖాద్రి ,మీర్జా రియాజ్ హాల్ హాసన్ ఎఫండీ, కౌసర్ మొహినుద్దీన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ , కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ,నవీన్ యాదవ్, అజారుద్దీన్,జోనల్ కమిషనర్ హేమంత్ ,ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply