Mopidevi | భారీ కంద..

Mopidevi | భారీ కంద..

Mopidevi, కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మోపిదేవి పంచాయతీ శివారు రావివారిపాలెం గ్రామానికి చెందిన సూరపనేని ప్రభు ప్రసాద్ పెరటిలో భారీ స్థాయిలో కంద దుంప పెరిగి అబ్బుర పరుస్తోంది. ఇంటి పెరటిలో కూరలు, పూలమొక్కలతో కలసి ఒక కంద మొక్క ఏపుగా పెరిగింది. మొక్క కాలం తీరటంతో దుంపను తవ్వి బయటికి తీశారు.

కాటా పెట్టి చూడక 13.26 కిలో గ్రాములు ఉన్నట్లు ఇంటి యజమాని తెలిపారు. భారీ స్థాయిలో కంద దుంప పెరగటంతో చుట్టుపక్కల వాళ్లు ఆసక్తి చూశారు. కంద దుంప సుమారు నాలుగు కేజీల నుంచి ఐదు కేజీల వరకు మాత్రమే ఉంటుందని, ఇంత భారీ కంద దుంపను ఎప్పుడూ చూడలేదు అన్నారు.

Leave a Reply