Monday 23:44 PM : 48 గంటల డెడ్‌లైన్ Andhra Prabha Story

Monday 23:44 PM : 48 గంటల డెడ్‌లైన్ Andhra Prabha Story

  • క్లైమాక్స్ లో హోర్ముజ్‌
  • ట్రంప్ అల్టిమేటం
  • ఇరాన్ కౌంటర్
  • మిడిల్ ఈస్ట్‌ గజగజ
  • డెమోక్రాట్లు తిట్లదండకం
  • ప్రపంచం బిక్కుబిక్కు
  • అమెరికన్లు అయోమయం

ఆంధ్రప్రభ, న్యూయార్క్​ ప్రతినిధి

Monday 23:44 PM

48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని “పూర్తిగా తెరిస్తే” తప్ప ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను “తుడిచిపెట్టేస్తామన్న” తన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తే, మధ్యప్రాచ్యం అంతటా ప్రతీకారం తీర్చుకుంటామని, కీలక మౌలిక సదుపాయాలను, ఇంధన కేంద్రాలను “కోలుకోలేని రీతిలో ధ్వంసం చేస్తామని ఇరాన్ పేర్కొంది.

Monday 23:44 PM

యుద్ధం నాలుగో వారానికి చేర‌గా… వైరి దేశాల మ‌ధ్య దాడి, ప్ర‌తి దాడుల‌తో ప‌శ్చిమ ఆసియా మ‌హోగ్ర రూపం దాల్చింది. అటు డ్రోన్లు, క్షిప‌ణులతో ఇరాన్‌, ఇజ్రాయెల్ ప‌ర‌స్ప‌ర దాడుల‌కు దిగుతుంటే.. ఇక అమెరికా, ఇరాన్ మ‌ధ్య మాట‌ల బాంబులు పేలుతున్నాయి. ఇరాన్ అణుకేంద్రం నంతాజ్ పై ఇజ్రాయెల్ దాడికి ప్.. ఇజ్రాయెల్ లోని అణుకేంద్రం డిమోనాపై క్షిప‌ణుల‌ను కుమ్మ‌రించి ఇరాన్ ప్ర‌తీకారం తీర్చుకుంది. ఇంత‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంహెచ్చ‌రిక‌లు జారీ చేయ‌టంతో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో తీవ్ర అలజడి రగలింది. హోర్ముజ్ జలసంధిని ఎటువంటి ఆటంకాలు లేకుండా “పూర్తిగా తెరవాలని” ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. ఈ గడువు మార్చి 23, సోమవారం (GMT ప్రకారం రాత్రి 23:44 గంటలకు) ముగుస్తుంది. ఒకవేళ గడువులోగా జలసంధిని తెరవకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ నుంచి అన్ని కీలక ప్లాంట్లు. ఇంధన కేంద్రాలను “తుడిచిపెట్టేస్తామని” (Obliterate) తన ‘ట్రూత్ సోషల్’ ఖాతా ద్వారా అమెరికా అధ్య‌క్షుడు హెచ్చరించారు.

Monday 23:44 PM : ఓకే.. మేమూ రెడీ

Monday 23:44 PM

అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే, తాము కూడా మధ్యప్రాచ్యం అంతటా అమెరికా, ఇజ్రాయెల్ స‌హా మిత్రదేశాల కీలక మౌలిక సదుపాయాలను “కోలుకోలేని రీతిలో ” (Irreversibly) ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించింది. కేవలం సైనిక స్థావరాలే కాకుండా, అమెరికా ఇంధన నిల్వలు (Fuel depots), మంచినీటి ప్లాంట్లు (Desalination plants) ఐటి (IT) వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సైనిక ప్రతినిధి ‘ఇబ్రహీం జోల్ఫాఘరీ’ స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి సాధారణ నౌకలకు తెరిచే ఉందని, కేవలం “శత్రు దేశాల” (అమెరికా, ఇజ్రాయెల్) నౌకలకు మాత్రమే అనుమతి లేదని ఇరాన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Monday 23:44 PM : యుద్ధం యథాతథం

Monday 23:44 PM

ఇప్పటికే ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని ‘డిమోనా. ‘అరాద్’ నగరాలపై పడి 100 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు అమెరికా తన భారీ బాంబర్లను (B-1 bombers) వేలాది మంది సైనికులను మధ్యప్రాచ్యానికి తరలిస్తూ యుద్ధానికి సిద్ధమవుతోంది.
ఈ 48 గంటల గడువు ముగిసేలోపు చర్చలు జరగకపోతే, ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే మహా యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. సైనిక చర్యలు తీవ్ర హెచ్చరికలతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవడంలో టెహ్రాన్ విఫలమైతే, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Monday 23:44 PM

ఇక క్షేత్రస్థాయిలో, ఇరాన్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది, డిమోనా మరియు అరద్ నగరాల్లో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిని “యుద్ధంలో ఒక కఠిన సాయంత్రం”గా అభివర్ణించారు. టెహ్రాన్, కరాజ్, ఇస్ఫహాన్, నతాంజ్ సహా ఇరాన్ అంతటా అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. సౌదీ అరేబియా తన మిలిటరీ అటాచీతో సహా పలువురు ఇరాన్ రాయబార కార్యాలయ సిబ్బందిని అవాంఛనీయ వ్యక్తులుగా (పర్సోనా నాన్ గ్రాటా) ప్రకటించి, 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది బహ్రెయిన్‌లో డజన్ల కొద్దీ ప్రజలకు గాయాలు, పేలుడుకు పేట్రియాట్ క్షిపణిగా భావిస్తున్నారు.

Monday 23:44 PM

బహ్రెయిన్‌లో శ‌నివారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో డజన్ల కొద్దీ పౌరులు గాయపడగా, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ పేలుడుకు కారణమైన ఇంటర్‌సెప్టర్ క్షిపణిని అమెరికా ఆధీనంలోని పేట్రియాట్ వాయు రక్షణ వ్యవస్థ ప్రయోగించి ఉండవచ్చని తెలుస్తోంది. లెబ‌నాన్ లోని హిజ్బుల్లా యాక్తివ్ గా మారింది. మిస్గావ్ ఆమ్‌లో ఇజ్రాయెల్ సైనికులను లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్బుల్లా ప్రకటించింది. లెబనాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతమైన మిస్గావ్ ఆమ్‌లో ఇజ్రాయెల్ సైనికులపై దాడి చేసినట్లు హిజ్బుల్లా తెలిపింది.

Monday 23:44 PM : ఆయ‌న భ‌యాందోళ‌న‌లో ఉన్నారు

Monday 23:44 PM

ఇరాన్ లో యుద్ధం నాలుగో వారానికి చేర‌టంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై “యుద్ధంపై నియంత్రణ కోల్పోయారని” తీవ్ర భయాందోళనలో ఉన్నారని అమెరికా డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీ అన్నారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను “తుడిచిపెట్టేస్తానని” ట్రంప్ హెచ్చరిక‌ల‌పై మ‌ర్ఫీ తీవ్రంగా స్పందించారు. పెరుగుతున్న ఇంధన ధరల మధ్య ఈ ఘర్షణ అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంద‌ని ఇది “ట్రంప్ పిచ్చి యుద్ధంగా మ‌ర్ఫీ అభివర్ణించారు.

Monday 23:44 PM : ప్ర‌పంచ నాశ‌న‌మే ఆయ‌న కంక‌ణం

Monday 23:44 PM

48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను “తుడిచిపెట్టేస్తామని” అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో, అమెరికా డెమోక్రటిక్ చట్టసభ్యురాలు యాసమిన్ అన్సారీ ఆయనను విమర్శించారు. ఆ దేశాన్ని, మిగతా ప్రపంచాన్ని “నాశనం చేయాలనే కంకణం కట్టుకున్న ఒక ఉన్మాద నియంత” వైట్ హౌస్‌ను నడుపుతున్నారని అన్సారీ అన్నారు. “ఇరాన్ నిరసనకారులకు ‘సహాయం వస్తోంది’ అని చెప్పడం నుండి, ఒక జాతి ప్రజలందరిపై యుద్ధ నేరాలకు పాల్పడుతున్నార‌ని బెదిరించడం వరకు ఇరాన్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులు ఉన్నార‌ని అన్సారీ అన్నారు. యఇరాన్‌తో యుద్ధానికి వెళ్లాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఆమె “అవివేకం, చట్టవిరుద్ధం గా అభివర్ణించారు. అమెరికన్ల ప్రాణ నష్టంతో సహా దాని “విపత్కర పరిణామాల” గురించి ఆమె హెచ్చరించారు.

ALSO READ : 100 Injured : లిటిల్​ ఇండియా జస్ట్​ బేజార్​ ​.. Andhra Prabha Latest News

Leave a Reply