Mom’s lap | 367వ వారంకు చేరిన ‘అమ్మ ఒడి’ అన్నదానం

Mom’s lap | 367వ వారంకు చేరిన ‘అమ్మ ఒడి’ అన్నదానం
- 200 మందికి అన్నాదానం
Mom’s lap | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలో ‘అన్నమో రామచంద్ర’ అని అలమటించే ఆకలి గొంతుకలకు ‘అమ్మ ఒడి’ ఎన్జీవో అండగా నిలుస్తోందని అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ తెలిపారు. . ఆదివారం కాంటా చౌరస్తాలోని పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ , టెక్నో డాన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
2020 ఏప్రిల్ 5న ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం నేటికి 367వ వారానికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ వారం అన్నదాన కార్యక్రమాన్ని కొండ సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేశారని వారు తెలిపారు. ససుమారు 200 మందికి పేద ప్రజలకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మించిన తృప్తి మరొకటి లేదని, దాతల సహకారం ఈ ప్రాజెక్టుకు వెన్నెముక అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు కొండ భారతి, సాయిరాం, అమ్మ ఒడి ప్రతినిధులు హనుమాండ్ల సువర్ణ, గన్నేవరం తిరుమల చారి, మాటూరి వర ప్రసాద్, ఎండీ యూసుఫ్, చెందుపట్ల లింగమూర్తి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
