Modi, Putin | ఒత్తిళ్లకు అతీతం.. మన బంధం..
Modi, న్యూఢిల్లీ ఆంధ్రప్రభ : భారత్-రష్యా (India Russia) స్నేహం ధృవతారలా వెలిగిపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారమిక్కడ హైదరా బాద్లో హౌస్ లో 23వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కలిసి సంయుక్తంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అంతర్జాతీయ సమస్యలకు ఉక్రెయిన్ సంక్షోభం పై మా వైఖరి మొదటి నుంచి స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కా రానికి భారత్ మద్దతు ఇస్తోంది. మేము తటస్థం కాదు, శాంతి వైపు ఉన్నాము. ఈ సంక్షోభానికి శాంతియుతమైన, శాశ్వత పరిష్కారానికి జరిగే అన్ని ప్రయత్నాలకు మేము స్వాగతి స్తాం. తన వంతు పాత్ర పోషించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఉంటుంది అని మోడీ అన్నారు. యుక్రెయిన్ శాంతి చర్చల్లో భారత్ చేసిన ప్రయత్నాలకు ప్రెసిడెంట్ పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.
ధ్రువతారలా వెలిగిపోతున్న స్నేహబంధం..
గత ఎనిమిది దశాబ్దాల్లో ప్రపంచం అనేక ఉత్థానపతనాలను చవి చూసింది. అనేక సవాళ్లు, సంక్షోభాలను మానవాళి ఎదుర్కొన్నది. వీటిన్నింటి మధ్యలో, భారత్-రష్యా స్నేహం ధ్రువతార లాగా చెక్కుచెదరకుండా, దృఢంగా నిలిచింది. ఈ స్నేహం మా రెండు దేశాల ప్రజలకు ఆకాంక్షలకు, భద్రతకు నిదర్శనం. గత రెండు దశాబ్దాలుగా తమ నాయకత్వం, దృష్టితో ఈ స్నేహాన్ని ప్రెసిడెంట్ పుతిన్ (putin) పోషించారు. ఎళ్లవేళలా ఆయన నాయకత్వం మన సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చింది. ఈ గాఢమైన స్నేహానికి, భారత్ పట్ల అచంచలమైన నిబద్ధతకు, నా మిత్రుడు, ప్రెసిడెంట్ పుతిన్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని
తెలిపారు.
ఆర్థిక సహకారానికి విజన్ 2030 డాక్యుమెంట్..
ఈ రోజు మేము మా సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను చర్చించాము. ఆర్థిక సహకారానికి ప్రాధాన్యత ఇచ్చాము. ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయ డానికి, మేము 2030 వరకు విజన్ 2030 డాక్యుమెంట్పై సంతకం చేశాము. ఈ కార్యక్రమం మా వాణిజ్యాన్ని విస్తరించడానికి, విభిన్నీకరించ డానికి సహాయ పడుతుంది. మేము యూరేషియన్ ఎకనామిక్ యూని యన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను త్వరగా ముగించడా నికి ప్రయత్నిస్తున్నాము. 2030 నాటికి భారత్-రష్యా వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పైగా చేర్చడాన్ని లక్ష్యం పెట్టుకున్నాము. ఈ లక్ష్యాన్ని సాధించడా నికి, మేము 2030 వరకు ఆర్థిక సహకార కార్యక్రమంపై ఏకాభిప్రాయానికి వచ్చాము అని మోడీ చెప్పారు.

