Mock exercise | జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో…

Mock exercise | జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో…

  • విజయవంతంగా విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్

Mock exercise | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో ఈ రోజు జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ- ఎన్ఎండిఏ), రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నేతృత్వంలో విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్(Mock exercise) నిర్వహించారు. ఈ మాక్ ఎక్సర్సైజ్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) పర్యవేక్షణలో జరిగింది. మాక్ ఎక్సర్సైజ్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు.

భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు, ప్రజల భాగస్వామ్యం, అధికారుల మధ్య సమన్వయానికి ఈ మార్క్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా విపత్తు పరిస్థితులు ఏర్పడినట్లు కృత్రిమంగా సృష్టించి, సహాయక కార్యక్రమాలు(Auxiliary Programs) చేపట్టారు. వరదలు, నదులు, ముంపు ఇండ్లలో చిక్కుకున్న ప్రజలను రక్షించుట, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రథమ చికిత్స అందించుట, ఆసుపత్రికి తరలించుట, పునరావాసం కల్పించుట, భోజనం, తదితర అంశాలను వాలంటీర్ల భాగస్వామ్యంతో చేపట్టారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా అగ్నిమాపక( fire brigade) అధికారులు ప్రభాకర్, శివాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు జీవరత్నం, నరసింహా రెడ్డి, రాజేందర్, శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్లు రాజు, ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply