ఎన్టీఆర్ పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పామర్రు, ఆంధ్రప్రభ ; పామర్రు టౌన్ చాట్లవానిపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి ప్రతీ నెల పింఛన్ 1వ తేదీన అందుతుందా లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply