MLA | నూతన కమిటీ ఎన్నిక

MLA | నూతన కమిటీ ఎన్నిక

MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణ ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్(Fruit Merchant Association) నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ రోజు ఎల్లమ్మ గుడి ఆవరణలో నిర్వహించారు. ఎన్నికల్లో 50 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

సభ్యులు ఏకగ్రీవంగా మహమ్మద్ గౌస్ బాయ్(Mohammed Ghaus Boy)ను అధ్యక్షుడిగా, షేక్ ఫైన్ ను ఉపాధ్యక్షుడిగా, మేడిపల్లి రమేష్ ను కోశాధికారిగా, అస్లాం మహమ్మద్ షేక్ బాబాను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అంతేకాకుండా ఆసంపల్లి గోపిను సహాయ కార్యదర్శిగా, హైకోర్టు న్యాయవాది మహమ్మద్ ఇమ్రాన్ ను న్యాయ సలహాదారుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ బాయ్ మాట్లాడుతూ.. ఫ్రూట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు పునరావాసం కల్పిస్తూ, తగిన స్థలాలు వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ గౌస్ బాయ్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply